Home Page SliderNationalNews AlertPolitics

నిన్ననే ప్రమాణస్వీకారం..అప్పుడే మొదలుపెట్టారా?

ఢిల్లీలో నిన్ననే ప్రమాణస్వీకారం చేసిన నూతన సీఎం రేఖాగుప్తాపై అప్పుడే విమర్శలు మొదలుపెట్టింది ప్రతిపక్షం ఆప్. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదంటూ విమర్శలు కురిపించారు మాజీ సీఎం ఆతిశీ. అయితే ఈ విమర్శలను ధీటుగా తిప్పికొట్టారు రేఖాగుప్తా. ఆప్ 13 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిందని, అంతకు ముందు కాంగ్రెస్ 15 ఏళ్లు పాలించిందని ఈ రెండు పార్టీలు ఢిల్లీకి ఏం చేశారంటూ ప్రశ్నించారు. తాము తొలిరోజే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీలో ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ను ప్రారంభించామని వెల్లడి చేశారు. దీనితో ప్రజలకు రూ.10 లక్షల ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. నిన్ననే ఏర్పాటయిన ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.