HealthNews

మీ నోటిలోని బ్యాక్టీరియా మీ కీళ్ల మీద ప్రభావం చూపిస్తుందని మీకు తెలుసా?

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం శుభ్రంగా ఉంటే రోగాలు తొందరగా మన దరిచేరవు. శుభ్రంగా ఉండడం అంటే కేవలం శరీరం ఒక్కటే కాదు మన దంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే పీరియాడోంటల్ అనే వ్యాధి బారిన పడతాము. దానివల్ల దంతాల చుట్టూ ఉన్న చిగుర్లు ప్రభావితం అవుతాయి. నోటిలోని బ్యక్టీరియా వల్ల కీళ్లు ప్రభావితం అవుతాయి.

ఈ పీరియాడోంటల్ వ్యాధికారక అగ్రిగేటిబాక్టర్ ఆక్టినోమైసెటెమ్‌కోమిటాన్స్‌కి, కీళ్లను ప్రభావితం చేసే వ్యాధి అయిన రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి దగ్గరి సంబంధం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దంత సమస్యలు ఏమున్నా చిన్నదే కదా అని దానిని నిర్లక్ష్యం చెయ్యకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలని సూచిస్తున్నారు.