చంద్రబాబు వైసీపీ మ్యానిఫెస్టోని కాపీ కొట్టారా?
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాగా టీడీపీ తాజాాగా నిర్వహించిన మహనాడు కార్యక్రమంలో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు వైసీపీ నేతలు సిద్దమయ్యారు. ఇప్పటికే వైసీపీ మంత్రులు ,ఎమ్మేల్యేలు చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అయితే తాజాగా వైసీపీ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. కాగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు పూర్ టు రిచ్ అనే కార్యక్రమం తన 75 ఏళ్ల వయసులో, రాజకీయ జీవన సంధ్యలో గుర్తొచ్చిందా అని ఆయన నిలదీశారు. మరి ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో పేదలను ధనికులుగా ఎందుకు మార్చలేదని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైసీపీ శ్రేణులు ప్రకటించాయి. మహానాడులో చంద్రబాబునాయుడు ప్రకటించిన మేనిఫెస్టో చూస్తుంటే వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను కాపీ కొట్టినట్లు కన్పిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొద్దీ రోజుల క్రితం రాజధాని అమరావతిలో పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలనును శవాలు పూడ్చుకోవడానికి తప్ప దేనికి పనికి రాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మహానాడులో చంద్రబాబునాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను కాపీ కొట్టినందుకుగాను నిరసనగా వైయస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలను నిర్వహించింది.