కరోనా వల్ల పిల్లలలో డయాబెటిస్ ముప్పు
గతంలో కరోనా సోకిన పిల్లలలో డయాబెటిస్ ముప్పు పొంచి ఉందని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ తెలిపింది. కొవిడ్ వచ్చి తగ్గిన పిల్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని వారు నిర్వహించిన సర్వేలో తేలింది. వీరు ఎక్కువగా టైప్ 1 డయాబెటిస్‌కు లోనవుతున్నారు. ఈ లక్షణాలు వేగంగా బయటపడుతున్నాయి. ఈ వైరస్ రోగనిరోధక శక్తి, ప్యాంక్రియాస్‌పైనా దాడి చేసి వాటిని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పిల్లలలో అతి దాహం, తరచూ మూత్రవిసర్జన, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డయాబెటిస్‌కు సంబంధించిన బ్లడ్‌టెస్ట్ చేయించి ప్రారంభదశలోనే గుర్తించాలని తెలిపింది. దీనివల్ల ఎక్కువ ప్రమాదం జరగకుండా ట్రీట్‌మెంట్ మొదలుపెట్టవచ్చని ఈ జర్నల్ హెచ్చరించింది.

