NationalNews Alert

మహేష్‌తో ధోని సినిమా

టీమిండియా మాజీ కెప్టెన్ ధోని సినిమాల్లోకి తన ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌తో వస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ధోని నిర్మాణంలో త్వరలోనే మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త విని మహేష్ బాబు , ధోని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో మహేష్ బాబుతో, తమిళంలో దళపతి విజయ్‌తో ధోని ప్రొడక్షన్ హౌస్ నుండి సినిమాలు రానున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సర్కారు వారి పాట తర్వాత టాలివుడ్ ప్రిన్స్ మహేష్ బాబు వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. త్రివిక్రమ్‌తో కలిసి భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. దీని షూటింగ్ కూడా ప్రారంభం అయింది. కానీ మహేష్ తల్లి ఇందిరా దేవి మరణంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ సినిమా షూటింగ్ అనంతరం ఎస్ ఎస్ రాజమౌళితో మహేష్ సినిమా చేస్తున్నాడు. ఒకదాని తర్వాత మరొక సినిమాతో మహేష్ షెడ్యూల్ చూస్తుంటే రానున్న రోజుల్లో మహేష్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ టాప్ స్టార్ గా ఎదిగే అవకాశం ఉంది.