Home Page SliderNational

ధోనీ భాయ్ నీకోసం ఏదైనా చేస్తా:జడ్డూ

ఈ IPL సీజన్‌లో CSK VS  GT మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. దీంతో 5వసారి CSK టీమ్ IPL ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌ లక్ష్యఛేధనలో CSK కెప్టెన్ ధోనీ వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి. అంతేకాకుండా CSK టీమ్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈ గెలుపులో ముఖ్య పాత్ర పోషించారు. కాగా జడేజా చివరి రెండు బంతుల్లో సిక్స్,ఫోర్ కొట్టి టీమ్‌ను గెలిపించారు. దీంతో కెప్టెన్ కూల్ ధోనీ జడేజాను ఎత్తుకొని భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా జడేజా ఓ స్పెషల్ ట్వీట్ చేశాడు. మేము ఒకే ఒక్కడు ధోని భాయ్ కోసం ఇది చేశాము. మహీ భాయ్ కోసం ఏదైనా చేస్తా అని తెలుపుతూ..కొన్ని ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేశాడు. దీంతో ధోని,జడ్డూ మధ్య ఉన్న స్నేహం ఇది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.