ఇండియా టీమ్‌కు వన్డే కెప్టెన్‌గా ధావన్
దక్షిణాఫ్రికాలో జరగనున్న మూడు వన్డే సీరీస్‌కి సంబంధించిన టీమ్ ఇండియా కెప్టెన్‌గా ధావన్ వ్యవహరించనునట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 6 నుండి 11 వరకు జరగనున్న ఈ టోర్నీలు జరగనున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో పాల్గనే ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చేందుకు ధావన్‌కు కెప్టెన్సీ పదవీ ఇచ్చినట్టు సమాచారం. లెప్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేసే అతికొద్ది మంది క్రికెటర్లలో ధావన్ కూడా ఒకరు. ఒపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ధావన్ ఎన్నో మ్యాచ్‌లలో తన సత్తా చాటుకున్నాడు. అయితే కెప్టెన్సీ భాద్యతలను ఎలా నిర్వర్తిస్తాడో వేచి చూడాల్సిందే.

