త్వరలో ధనుష్ “కెప్టెన్ మిల్లర్” టీజర్
స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న కొత్త సినిమా “కెప్టెన్ మిల్లర్”.కాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. అదేంటంటే ఈ సినిమా టీజర్ ఈ నెల 28 విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. కాగా ఈ సినిమాకి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్,టాలీవుడ్ హీరో సందీప్ కిషన్,ప్రియాంక మోహన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల “సార్” మూవీతో ధనుష్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

