శ్రీవారి భక్తులెవరూ చంద్రబాబు దుష్పచారాన్ని నమ్మొద్దు..
సీఎం చంద్రబాబు దుష్పచారాన్ని శ్రీవారి భక్తులెవరూ నమ్మొద్దని ప్రముఖ న్యాయవాది, మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలోని వ్యక్తి ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పచ్చి అబద్దాలకోరని, ఆయన అసత్యాలకు ఓ చరిత్ర ఉందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం మహా పాపమని మండిపడ్డారు. తిరుమల లడ్డూ వివాదంపై దర్యాప్తు జరపాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ తో కాకుండా సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలన్నారు. ఎందుకంటే సిట్ పోలీసులు కేవలం సమాచారం మాత్రమే సేకరిస్తారు.. అదే సుప్రీం కోర్టు అయితే కల్తీ జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. ఈ వ్యవహారంలో వెనుక ఎవరున్నారు, ఎందుకు చేశారు అనే విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. అప్పుడు సీబీఐ విచారణ అవసరం ఉండే అవకాశాలు ఉంటాయని సుబ్రమణియన్ స్వామి తెలిపారు.