అయోధ్యకు పోటెత్తిన భక్తులు..
దేశం నలుమూలల నుండి యూపీలోని కుంభమేళా కోసం వెళ్లిన భక్తులు దగ్గరలోని అయోధ్యను కూడా సందర్శిస్తున్నారు. దీనితో పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు పోటెత్తారు. ఈ రద్దీతో అయోధ్య మందిరం ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మార్చారు ఆలయ కమిటీ. ముఖ్యంగా భక్తులు అయోధ్య ఆలయ మొదటి గేటు దగ్గర విడిచి పెట్టిన చెప్పులను తొలగించడం పెద్ద సమస్యగా మారింది. లక్షల సంఖ్యలో వస్తున్న భక్తుల పాదరక్షలను దర్శనం తర్వాత వారు తిరిగి వేసుకోవాలంటే దాదాపు ఐదారు కిలోమీటర్లు నడిచి రావాలి. దీనితో చాలామంది వదిలి వట్టి కాళ్లతోనే వెళిపోతున్నారు. దీనితో వాటిని తొలగించడానికి మున్సిపల్ అధికారులు పొక్లెయిన్లు, ట్రాలీలు వినియోగించాల్సి వస్తోంది. నెలరోజులుగా బయటకు వెళ్లే గేటును మార్చడం వల్ల ఈ సమస్య తలెత్తింది.