Breaking NewsHome Page Sliderhome page sliderInternationalNewsNews Alertviral

కుదేలైన వలసలు..ట్రంప్ దూకుడు


అమెరికాలో వలసదారుల జనాభా 1960 తర్వాత మొదటిసారిగా గణనీయంగా తగ్గిందని ప్యూ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తోన్న నివేదిక పేర్కొంది. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య దాదాపు 15 లక్షల మంది వలసదారులు తగ్గిపోగా, మొత్తం వలసదారుల జనాభా 5.19 కోట్లకు దారుణంగా పడిపోయింది. ఇమిగ్రేషన్ నిబంధనల కఠినతరం, సామూహిక దేశ బహిష్కరణలు, చట్టబద్ధమైన ప్రవేశాలపై ఆంక్షలు కారణమని వెల్లడించింది. వలసదారుల సంఖ్య తగ్గడం అమెరికా ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోందని నివేదిక హెచ్చరించింది. కార్మిక శక్తిలో 7.50 లక్షల మంది తగ్గిపోవడం పరిశ్రమలకు సవాలుగా మారిందని ప్యూ రిసెర్చ్ సెంటర్ సీనియర్ సభ్యుడు జెఫ్రీ పస్సెల్ పేర్కొన్నారు. వలస కార్మికులపై ఆధారపడిన రంగాల్లో ఉత్పాదకత తగ్గే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. “దేశీయంగా పని చేయగల వయసులో ఉన్న వారి సంఖ్య పెరగకపోవడంతో పరిశ్రమలకు వలస కార్మికులే ప్రధాన ఆధారం. వీరి సంఖ్య తగ్గితే ఆర్థికాభివృద్ధికి ముప్పే” అని ఆయన వివరించారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్ల అక్రమ వలసదారుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2023లో అక్రమ వలసదారుల సంఖ్య 1.40 కోట్లకు పడిపోయింది. అమెరికా ఇంకా ప్రపంచంలోనే అత్యధిక వలసదారులున్న దేశంగానే పేరుంది. ఈ ఏడాది జూన్ నాటికి అమెరికా జనాభాలో వలసదారుల వాటా 15.8 శాతం నుంచి 15.4 శాతానికి దిగజారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిణామం దీర్ఘకాలికంగా అమెరికా శ్రామిక మార్కెట్, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.