Home Page SliderNational

ఒకే వేదికపైకి ‘దేవర’ హీరో, ‘పుష్ప 2’ హీరో రానున్నారు?

నేడు (మంగళవారం) జరిగే ‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (పుష్ప 2 హీరో) చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారనే చర్చ బాగా వినబడుతోంది. తారక్, బన్ని ‘బావ’ అని ఒకరినొకరు కలుపుగోలుగా, ఆప్యాయంగా పిలుచుకుంటారనే విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘దేవర’ ఈవెంట్‌కు బన్ని రానున్నారని సమాచారం. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పాటలు హిట్ అయిన తరుణంలో ట్రైలర్‌ పైనా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.