News AlertTelangana

అమిత్ షా తెలంగాణా పర్యటన వివరాలివే

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణా పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అమిత్ షా ఈ ఆగస్టు 21న మధ్యాహ్నం 3.40 గంటలకి  హైదరాబాద్ వచ్చి సాయంత్రం  4.15 గంటలకి మునుగోడు CRPF ఆఫీసర్స్‌తో సమావేశమై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం  మునుగోడులో ప్రజలనుద్దేశించి ప్రసంగించబోతున్నారు. తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి రామోజీ రావును కలవబోతున్నారు. రాత్రి 8 గంటలనుండి 9.30 గంటల వరకూ శంషాబాద్‌లోని నోవాటెల్‌లో పార్టీ ముఖ్య సభ్యులతో సమావేశం కానున్నారు. అందిన సమాచారాన్ని బట్టి మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ సభ్యులకు అమిత్ షా సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం తిరిగి న్యూఢిల్లీకి వెళ్లనున్నారు.