Breaking NewscrimeHome Page SliderTelangana

అధికారంలో ఉన్న‌ప్పుడు విధ్వ‌సం…ఇప్పుడేమో బీభ‌త్సం

తెలంగాణ రాష్ట్ర అప్పుల తిప్ప‌ల‌పై డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అసెంబ్లీ స‌మావేశాల్లో శ్వేత ప‌త్రం విడుద‌ల చేశారు. తెలంగాణపై రూ.6.70 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని భట్టి విక్రమార్క శ్వేతపత్రంలో పేర్కొన్నారు.ఆరోగ్యశ్రీ, ఫీజురీఎంబర్స్‌మెంట్‌, ప్రాజెక్టుల పెండింగ్‌ బిల్లులు కలిపి రూ.40వేల కోట్లపైనే బ‌కాయిలున్నాయ‌న్నారు. సభలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా వ్యవహరించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.అధికారం కోల్పోయేస‌రికి విచ‌క్ష‌ణ కూడా కోల్పోయార‌న్నారు.స‌భ సాక్షిగా హ‌రీష్‌రావు ఆగ‌డాలు యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌లంతా వీక్షించార‌న్నారు. ప‌రిపాల‌న‌లో ఉన్న‌న్నాళ్లు విధ్వసం సృష్టించార‌ని ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలోనూ బీభ‌త్సం సృష్టిస్తున్నార‌ని ఆగ్ర‌హించారు.