ఫేక్ న్యూస్‌తో పార్లమెంట్లో పరువు పోగొట్టుకున్న ఉప ప్రధాని
పాకిస్తాన్ పార్లమెంట్లో ఫేక్ న్యూస్‌ను చదివి వినిపించిన ఉప ప్రధాని ఇషాక్ దార్ అభాసుపాలయ్యాడు. ఎందుకంటే పాక్‌కు చెందిన మీడియా సంస్థే ఆ న్యూస్ ఫేక్ అని పేర్కొంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌ను బ్రిటన్‌కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ అనే మీడియా మెచ్చుకుందంటూ పార్లమెంట్లో హెడ్‌లైన్స్ చదివి వినిపించాడు ఇషాక్ దార్. ఈ ఫేక్ న్యూస్‌ను నిజమనుకుని భ్రమపడ్డారు. అయితే ఈ వార్తపై స్పందించిన డైలీ టెలిగ్రాఫ్ మీడియా అసలు తాము అలాంటి హెడ్‌లైన్స్ పెట్టలేదని, పాక్‌ను ఎప్పటికీ పొగడమని తేల్చి చెప్పింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌కు బ్రిటన్ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఫేక్ న్యూస్‌లతో పబ్బం గడుపుకుంటున్న పాక్‌ను నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

