NewsNews AlertTelangana

హన్మకొండలో బీజేపీ సభకు అనుమతి నిరాకరణ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. హనుమకొండలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో శనివారం నిర్వహించే ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. అయితే.. ఈ సభకు అనుమతి లేదని పోలీసులు తనకు చెప్పారని, అందుకే తమ కళాశాల ఆవరణలో సభకు తాను అనుమతి ఇవ్వడం లేదని ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ బన్న ఐలయ్య చెప్పారు.

ఈ విషయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు వాట్సాప్‌లో తెలిపానన్నారు. మైదానంలో సభ కోసం బీజేపీ చెల్లించిన రూ.5 లక్షలు కూడా తిరిగి ఇచ్చేస్తామన్నారు. దీంతో రావు పద్మతో పాటు ప్రేమేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, బీజేపీ కార్యకర్తలు హన్మకొండ ఏసీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. సభకు హైకోర్టు నుంచి అనుమతి తీసుకొస్తామని చెప్పారు.