Home Page SliderTelangana

బిజినెస్ బాగా నడుస్తుందని 3 లక్షల డిమాండ్..

సికింద్రాబాద్ మారేడుపల్లిలో పోలీస్టేషన్ పరిధిలోని ఓ బిర్యాని సెంటర్‌ పై స్థానిక నాయకులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బిర్యాని సెంటర్ నిర్వాహకుడు అన్ లిమిటెడ్ ఫుడ్ అంటూ ఆఫర్ పెట్టి నడిపిస్తున్నాడు. బిర్యాని సెంటర్ బాగా నడుస్తుందని స్థానిక నాయకులు మూడు లక్షలు డిమాండ్ చేశారు.. అందుకు బిర్యాని సెంటర్ నిర్వాహకుడు నిరాకరించడంతో వంట సామగ్రిని కిందపడేసి, బిర్యాని సెంటర్ నిర్వహకులపై దాడికి యత్నించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోని తీసుకున్నారు.