ఢిల్లీ పొల్యూషన్ ఎఫెక్ట్…పంజాబ్, హర్యానా రైతులకు పన్ను పోటు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందాన మారింది రైతుల పరిస్థితి.ఢిల్లీకి రాకపోకలు సాగించే లక్షలాది వాహనాల వల్ల వాయుకాలుష్యం పెరుగుతుంటే వాటిపై నిబంధనలకు కాగితాలకే పరిమితం చేసి.. చేసేదేమీ లేక రైతుల మీద పడ్డారు. ఇటీవల దీపావళి సందర్భంగా పేల్చిన బాణాసంచా కారణంగా ఢిల్లీలో వాయుకాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు,హెచ్చరికలకు మించి ఆవరించింది.దీంతో దాయాది దేశమైన పాకిస్థాన్‌లో నూ వాయుకాలుష్యం ఏర్పడింది.ఈ తరుణంలో ఆ దేశ ప్రతినిధులు సైతం దీనంతటికి కారణం ఢిల్లీయే అని వాపోతున్నారు. దీంతో పాలకులు …పంజాబ్,హర్యాల రైతుల గుండెళ్లో బాంబులు పేల్చారు.2 ఎకరాలలోపు పంట వ్యర్ధాలను దహనం చేస్తే రూ.5వేలు, 2-5 ఎకరాలలోని పంట వ్యర్ధాలను దహనం చేస్తే రూ.10వేలు, 5 ఆపైన ఎకరాలలో పంట వ్యర్ధాలను దగ్ధం చేస్తే రూ.30వేల వరకు జరిమానా అని ప్రకటించారు. దీంతో ఆయా రాష్ట్రాల రైతులు లబోదిబోమంటున్నారు.