పాత వాహనాలపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కాలుష్య కట్టడి చర్యలు ప్రారంభించింది. 15 ఏళ్లు పైబడిన పాత వాహనాలకు ఇకపై ఇంధనం అందదని పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. ప్రతీ పెట్రోల్ బంక్ వద్ద గాడ్జెట్ ఏర్పాటు చేస్తున్నామని, ఇవి 15 ఏళ్లు పైబడిన వాహనాలను గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈ ఆంక్షలను కేంద్ర పెట్రోలియం శాఖకు సమాచారం ఇస్తామని తెలిపారు. కాలుష్య నివారణ కోసం ఎత్తైన భవనాలు, హోటల్స్, వాణిజ్య సముదాయాలలో యాంటీ స్మోగ్ గన్లు అమర్చాలని పేర్కొన్నారు. ఈ డిసెంబర్ నాటికి పాత బస్సులను ఉపసంహరించుకుని, ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. అలాగే తుక్కు విధానాన్ని సమర్థవంతంగా అమలుచేయనున్నట్లు తెలుస్తోంది.