బ్రిజ్ భూషణ్‌కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించారని గతకొన్ని నెలలుగా భారత రెజ్లర్లు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో బ్రిజ్ భూషణ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళనలు కూడా చేపట్టారు. అయితే దీనిపై ఢిల్లీ కోర్టు తాజాగా స్పందించింది. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఎంపీ బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 18న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా లైంగిక ఆరోపణల కేసులో గత నెలలో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే దీనిని పరిశీలించిన కోర్టు బ్రిజ్ భూషణ్‌కు ఇవాళ సమన్లు జారీ చేసింది. అయితే ఈ కేసులో బ్రిజ్ భూషణ్‌తోపాటు అతని సెక్రటరీ వినోద్ కుమార్‌కు కూడా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.