ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం అప్పుడే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన బీజేపీ పార్టీ ఇంకా సీఎం ఎవరనే విషయం తేల్చలేదు. నూతన సీఎం ఎంపికపై బీజేపీ నేతలు ఈ నెల 17న భేటీ కానున్నట్లు సమాచారం. అప్పుడే ముఖ్యమంత్రి ఎంపికపై నిర్ణయం తీసుకుంటారని, నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి 19, 20 తేదీలలో ఉండవచ్చని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రధాని మోదీ అమెరికా, ఫ్రాన్స్ పర్యటనకు వల్ల ఈ సమావేశం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఆయన తిరిగి వచ్చాక సోమవారం ప్రధాని, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సమావేశం కానున్నారు. ఢిల్లీ కేబినెట్ కోసం ఇప్పటికే 15 మందిని ఎంపిక చేశారని, వారిని మంత్రి మండలిలో, స్పీకర్ స్థానాలకు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవికై ముఖ్యంగా కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ ఉన్నారు. ఆయనతో పాటు సతీశ్ ఉపాధ్యాయ్, విజయేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ వంటి పలువురు నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.

