కచ్చితంగా ప్రమాణం చేసి తీరతా
తెలంగాణ: తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని పేర్కొంటూ తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సిద్ధం అయ్యారు. దీంతో గచ్చిబౌలిలోని కౌశిక్‌రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మొహరించారు. అయితే పోలీసుల కళ్లుగప్పి, తప్పించుకుని కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి ఫిల్మ్‌నగర్‌లోని వేంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు పాదయాత్ర చేసి ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది.