ఆపరేషన్ సిందూర్ వివరాలు వెల్లడించిన రక్షణ శాఖ
తొలిసారి ఇద్దరు మహిళా ఆఫీసర్లు ఆర్మీ ఆపరేషన్ ను వివరించారు. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు ఆపరేషన్ సిందూర్..కేవలం 25 నిమిషాల్లోనే ఉగ్రస్థావరాలు ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడి చేసినట్లు రక్షణ శాఖ అధికారులు వివరించారు. పాకిస్తాన్, POKలో మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించామని కల్నల్ సోఫియా ఖురేషి పేర్కొన్నారు. పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఈ ఆపరేషన్ సిందూర్ చేపట్టామని అధికారులు తెలిపారు.