Home Page SliderInternationalNews AlertSports

లార్డ్స్‌లో ఓటమి..టీమిండియా జట్టులో భారీ మార్పులు

లార్డ్స్‌ లో జరిగిన టెస్ట్ సిరీస్‌ లోని మూడవ మ్యాచ్‌ లో, టీమిండియా ఇంగ్లాండ్‌ తో ధీటుగా పోరాడింది. కానీ, మ్యాచ్ చివరి రోజున ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మ్యాచ్‌ లో, టీమిండియాలోని కొంతమంది ఆటగాళ్లు బాగా రాణించాడు. కొంతమంది మాత్రం షాకిచ్చారు. దీంతో ముగ్గురు ఆటగాళ్ళు తదుపరి టెస్ట్ మ్యాచ్‌ కు దూరంగా ఉండాల్సి రావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. బుమ్రా పనిభారం నిర్వహణను దృష్టిలో ఉంచుకుని వచ్చే మ్యాచ్ లో అతనికి విశ్రాంతి నిచ్చే నిర్ణయం తీసుకోవచ్చు. బుమ్రాతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్ళు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ కూడా దూరం అయ్యే అవకాశాలున్నాయి. 8 సంవత్సరాల తర్వాత ఈ సిరీస్ ద్వారా టీమ్ ఇండియాలోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ ఎలా రాణిస్తాడోనని అంతా ఆసక్తిగా చూశారు. కానీ, కానీ లీడ్స్ నుంచి లార్డ్స్ వరకు ప్రతి మ్యాచ్‌ లోనూ కరుణ్ నాయర్ తీవ్రంగా నిరాశపరిచాడు. మొదటి సారిగా టెస్ట్‌లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్‌ను కూడా తొలగించి, రెండవ, మూడవ టెస్ట్‌లలో కూడా కరుణ్‌ కు అవకాశం ఇచ్చారు. కానీ, దాదాపు ప్రతి ఇన్నింగ్స్‌ లోనూ శుభారంభం చేసినప్పటికీ, నాయర్ దానిని భారీ ఇన్నింగ్స్‌ గా మార్చలేకపోయాడు. ఈ సిరీస్‌ లో, టీమిండియా టాప్ ఆర్డర్ నుంచి హాఫ్ సెంచరీ చేయని ఏకైక బ్యాట్స్‌ మన్ నాయర్. అతని అత్యధిక స్కోరు లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు. నాయర్ 3 టెస్ట్‌ లలో 6 ఇన్నింగ్స్‌లలో 131 పరుగులు మాత్రమే చేశాడు. ఎడ్జ్‌ బాస్టన్ టెస్ట్ తర్వాత, లార్డ్స్‌ లో వాషింగ్టన్ సుందర్ ఎంపికపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. అతని స్థానంలో ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ ను ఎంపిక చేయకూడదా ? అనే ప్రశ్న తలెత్తింది. ఎడ్జ్‌ బాస్టన్‌లో సుందర్ పెద్దగా రాణించలేకపోయాడు. కానీ, లార్డ్స్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో, అతను తన బౌలింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. నలుగురు ఇంగ్లాండ్ బ్యాట్స్‌ మెన్‌లను ఔట్ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ లలో బ్యాటింగ్‌ లో అతను ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఇటువంటి పరిస్థితిలో, టీమిండియా కుల్దీప్‌ కు లేదా అతని స్థానంలో రెగ్యులర్ స్పిన్నర్‌ గా ఏదైనా నాల్గవ పేసర్‌ కు అవకాశం ఇస్తుందా లేదా? అనేది చూడాలి. తదుపరి టెస్ట్ నుంచి నాయర్‌ ను మినహాయించడం దాదాపు ఖాయం అనిపిస్తుంది. కానీ, అందరి కళ్ళు కూడా బుమ్రాపైనే ఉంటాయి. టెస్ట్ సిరీస్‌కు ముందు బుమ్రా ఈ సిరీస్‌లో కేవలం 3 టెస్ట్‌లు మాత్రమే ఆడతాడని ప్రకటించిన సంగతి తెలిసిందే. లీడ్స్, లార్డ్స్‌లో బుమ్రా జట్టులో ఉన్నాడు. ఎడ్జ్‌ బాస్టన్ టెస్ట్ నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చారు. ఇటువంటి పరిస్థితిలో, టీమిండియా తదుపరి టెస్ట్‌ లో కూడా అతనికి విశ్రాంతి ఇస్తుందా లేదా ? అనేది ఇప్పుడు ప్రశ్న. తదుపరి టెస్ట్‌ లో 9 రోజుల విరామం ఉంది. ఇటువంటి పరిస్థితిలో, టీమిండియా ఈ విరామాన్ని అతని పనిభార నిర్వహణ కోసం ఉపయోగించుకుని మాంచెస్టర్‌ లో అతనిని రంగంలోకి దించుతారా లేదా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌ మాన్ గిల్ ఇప్పటికే నిర్ణయించిన ఫార్ములాకు కట్టుబడి ఉంటే, బుమ్రాకు విశ్రాంతి ఇవ్వవచ్చు.