పరువు నష్టం కేసు విచారణ ఈ నెల 30కి వాయిదా
మంత్రి కొండా సురేఖపై సినీ హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కొండా సురేఖ తరఫున అడ్వకేట్ గుర్మీత్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 30కి కోర్టు వాయిదా వేసింది. అయితే.. సమంత విడాకుల విషయంలో నాగార్జున ప్రమేయం ఉందంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మరో వైపు సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విషయమై నాంపల్లి న్యాయస్థానం ముందు ఆయన హాజరు కానున్నారు.