అమెరికాలో షాద్ నగర్‌వాసుల దుర్మరణం
అమెరికాలో తెలుగువారి మరణాలు వరుసగా సంభవిస్తున్నాయి.హత్యలు,ప్రమాదాలకు గురై చనిపోయే వారి సంఖ్య గణణీయంగా పెరిగిపోతుంది.తాజాగా షాద్ నగర్ వాసులు దుర్మరణం చెందారు. అమెరికాలో ని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు మృత్యువాత పడ్డారు.షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35), మనవడు హార్వీన్ (6), కూతురు అత్త సునీత (56) మృత్యువాత పడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లి గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది.మృతదేహాలను హైదరాబాద్ తరలించేందుకు ఇండియన్ ఎంబసీ ఏర్పాట్లు చేస్తుంది.