ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4102 ఆమోదం పొందగా, 141 మంది ఉపసంహరించుకున్నారు. 25 లోక్ సభ స్థానాలకు గాను 747 నామినేషన్లు ఆమోదం పొందగా, 23 మంది అభ్యర్థిత్వాన్ని విత్ డ్రా చేసుకున్నారు. ఇక తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 1011 ఆమోదం పొందగా, 49 మంది నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. ముగిసిన నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసే సమయంలో రెబల్స్, స్వతంత్రలు అభ్యర్థిత్వాన్ని విత్ డ్రా చేసుకున్నారు. ఇక నూజివీడులో టీడీపీ రెబల్ నాయకుడు ముద్రబోయిన వెంకటేశ్వరరావు, మాడుగులలోనూ పైలా ప్రసాద్ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. కాగా… విజయనగరం టీడీపీ రెబెల్ మీసాల గీత, ఉండి రెబెల్ కలవపూడి శివ బరిలో నిలిచారు. హిందూపురంలో బీజేపీ రెబల్ గా స్వామి పరిపూర్ణానంద కొనసాగుతున్నారు.