Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

సమర్థులకు మాత్రమే DCC అధ్యక్ష పదవులు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ (DCC) అధ్యక్షుల నియామకంపై PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్య ప్రకటన చేశారు. సమర్థులు, నిబద్ధత కలిగిన నేతలకే ఈ పదవులు దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు.

మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా దరఖాస్తులు అందాయని తెలిపారు. “పార్టీలో కనీసం ఐదేళ్లపాటు క్రియాశీలకంగా పనిచేసి ఉండాలి. ఈ అర్హతను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటాం” అని వివరించారు.

డిసెంబర్ 3న అధిష్ఠానం సీఎం, డిప్యూటీ సీఎం, PCC అధ్యక్షుడి అభిప్రాయాలను తీసుకొని తుది జాబితాను ఖరారు చేస్తుందని చెప్పారు. ఎంపికలో సామాజిక న్యాయాన్ని కచ్చితంగా పాటిస్తామని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా, ఇప్పటికే పదవుల్లో ఉన్నవారికి DCC అధ్యక్ష పదవి ఇవ్వబోమని స్పష్టం చేశారు. “ఒకే వ్యక్తికి పలు పదవులు ఇవ్వడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. కాబట్టి, ప్రస్తుతం ఏదైనా పదవిలో ఉన్నవారికి DCC అవకాశం ఉండదు” అని ఆయన తెలిపారు.

పార్టీ బలపరచడమే లక్ష్యమని, స్థానిక స్థాయిలో శక్తివంతమైన నాయకత్వం ఏర్పడేలా నిర్ణయం తీసుకుంటామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.