టీఆర్ఎస్‌లో చేరనున్న దాసోజు శ్రవణ్
బీజేపీ నేత దాసోజ్ శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇవాళ సాయంత్రం కేటిఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే బీజేపీని విడుతున్నట్లు తన రాజీనామా లేఖను బండి సంజయ్ కి పంపారు. కొంత కాలం కిందటే దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన శ్రవణ్ ఇంత కాలం తర్వాత మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు. బూర నర్సయ్య గౌడ్ రాజీనామా తర్వాత టీఆర్ఎస్ పార్టీ చేరికల పై ఫోకస్ పెట్టి ఎక్కువ మందిని చేర్చుకుంటుంది.ఇప్పుడు దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్‌లో చేరుతుండటంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయాయి.

