ముదురుతున్న కేసుల మంచు
తెలుగు రాష్ట్రాల్లో మంచు దుమారం కాకరేపుతోంది.పాత సంవత్సరం ఎండింగ్‌లో…కొత్త ఏడాది స్టార్టింగ్‌లోనూ మంచు ఫ్యామిలీ వివాదాల టపాకాయలు దీపావళి బాణాసంచాలా గ్యాపిచ్చి గ్యాపిచ్చి పేలుతున్నాయి.తాజాగా చంద్రగిరి డెయిరీ ఫాం గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మోహన్‌బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి.తనపై, తన భార్య మౌనికపై దాడికి ప్రయత్నించారంటూ మనోజ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనితో పాటు ..మోహన్‌బాబు పీఏతో సహా ఎంబీయూ సిబ్బంది 8 మందిపై కేసులు నమోదయ్యాయి.