Andhra PradeshHome Page SliderNewsNews AlertTrending Today

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో VRSపై చీకటి కోణం…

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు VRSపై యాజమాన్యం సర్వేలు నిర్వహిస్తోంది. VRS కోరుకునే ఉద్యోగి 15 ఏళ్ల సర్వీస్ లేదా 45 ఏళ్లలోపు ఏజ్ ఉండాలని నిబంధన పెట్టింది. అర్హులైన వారు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో VRS పేరుతో యాజమాన్యం దగా చేస్తోందని, 2500 మందిని ఇంటికి సాగనంపడానికి పెద్ద పెద్ద కుట్రలు చేస్తున్నారని ఉద్యోగులు వాపోయారు. అయితే పరిహారం గురించి మాత్రం ఏ మాత్రం ప్రస్తావన తేవడం లేదు, ఎన్ని లక్షలు నష్టపరిహారం రూపంలో ఇస్తారో ఏమిటో ఏ విషయం బయటకు పొక్కలేదు, దీంతో ఎంప్లాయీస్‌లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.