కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు పండగే
కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు డీఏ పెంచుతూ తీపి కబురునందించింది కేంద్రప్రభుత్వం. 4శాతం డీఏ, డీఆర్ పెంచుతూ, దీనిని ఈ ఏడాది జనవరి 1 నుండి అమలులోకి వచ్చేలా నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి చేరనుంది. దీనివల్ల దాదాపు 48 లక్షల మంది ఉద్యోగులు, 70 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది. 7వ వేతన సవరణ ద్వారా ఈ పెంపును అమలు చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు.