Breaking NewsHome Page SliderTelangana

ఎమ్మెల్యేని బెదిరించిన సైబ‌ర్ నేర‌గాళ్ళు అరెస్ట్‌

న్యూడ్ వీడియో కాల్స్‌తో ఎమ్మెల్యే వేముల వీరేశంను బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.వారం రోజుల‌ క్రితం వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేసి, ఆ తర్వాత వాట్సాప్ నెంబర్‌కు స్క్రీన్ రికార్డు పంపి డబ్బులు డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.ఈ నేప‌థ్యంలో ఆయ‌న పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు ని ద‌ర్యాప్తు చేసిన అధికారుల‌కు నిందితులు మ‌ధ్య ప్ర‌దేశ్‌లో చిక్కారు. ఆ రాష్ట్ర పోలీసుల స‌హ‌కారంతో నిందితుల‌ను న‌కిరేక‌ల్‌కి తీసుకొచ్చారు.