బ్యాంకుకు తాళం వేసిన కస్టమర్లు..
వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో గందరగోళం చోటు చేసుకుంది. ఖాతాదారులు బ్యాంకు సిబ్బందిని బయటకు వెళ్లగొట్టి తాళం వేసిన ఘటన సంచలనం కలిగించింది. అసలు విషయమేమిటంటే నవంబరులో ఈ బ్యాంకులో బంగారం చోరీ జరిగింది. 650 మంది ఖాతాదారులకు సంబంధించిన 20 కేజీల బంగారం చోరీ అయ్యింది. తమ బంగారం తమకు ఇప్పించాలని అడిగితే బ్యాంకు చుట్టూ తిప్పిస్తున్నారని ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో బంగారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకుకు తాళం వేసి, నినాదాలు చేస్తూ నిరసనలకు దిగారు.

