క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా..వాహనదారులకు ఊరట లేదాయే
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఈ మేరకు బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఒక బ్యారెల్ ధర 97.25 డాలర్లు పలుకుతుంది. అదే విధంగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో ఈ ధర మరి తగ్గినట్లు కనిపించగా 91.11 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదు అయ్యింది. ఇప్పుడు అంతర్జాతీయంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకపోవడం వల్ల బ్యారెల్ ధర మరింతగా క్షీణించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ విధంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మన దేశంలోని వాహనదారులుకు ఊరట కల్పించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు తాజాగా కొత్త ధరలను జారీ చేశాయి. వీటి ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 పైసలు,లీటర్ డీజిల్ ధర రూ.89.62 పైసలుగా ఉంది. దీంతో దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇటువంటి సమయంలోనైనా మమ్మల్ని కనికరించండంటూ..కేంద్రాన్ని వేడుకుంటున్నారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

