Home Page SliderNews AlertTelangana

శ్రీశైలం టన్నెల్ ప్రమాద బాధితులు ఏమయ్యారు?

శ్రీశైలం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8మందిపై దాదాపు ఆశలు వదులుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆర్మీ రెస్క్యూ టీమ్ టన్నెల్ చివరివరకూ వెళ్లి చూశారని, అక్కడ కేవలం మట్టి, బురద, కూలిన శిథిలాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. శిథిలాలు తొలగిస్తే మరింతగా టన్నెల్ కూలే ప్రమాదం ఉందని చెప్తున్నారు. దీనితో వారు టీబీఎం మెషిన్ చుట్టు ఉండే మట్టిలో, బురదలో కూరుకుపోయి ఉంటారని, ఇన్ని రోజులు జీవించి ఉండడం అసాధ్యమని పేర్కొన్నారు. సొరంగం కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారిందని, మొత్తం బురద, నీటితో నిండిపోయిందని సహాయక చర్యలకు వెళ్లిన ర్యాట్‌ హోల్ మైనర్స్ పేర్కొన్నారు. చిమ్మ చీకటి, ఊబి, ఆక్సిజన్ అందక పోవడంతో సహాయక చర్యలు కఠినమవుతున్నాయి. డ్రోన్ కూడా అక్కడికి చేరుకోలేని పరిస్థితి ఉంది.