ఖాళీ కారులో కోటి రూపాయలు
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా జాతీయ రహదారిలో ఖాళీ కారులో కోటి రూపాయల నగదు దొరకడం ఆశ్చర్యం కలిగించింది. అక్కడ జాతీయ రహదారి 63లో రామనగుళి వద్ద ఖాళీ స్థలంలో ఒక కారు ఉంది. అది రెండు రోజులుగా అక్కడే ఉండడంతో అనుమానించిన స్థానికులు అంకోలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రదేశంలో కారును పరిశీలించగా, అది బెంగళూరు రిజిస్ట్రేషన్‌తో ఉన్న హుండై క్రెటా కారుగా తేలింది. అయితే దీనిలో కోటి రూపాయల నగదు లభించింది. ఈ కారును, నగదును పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ కారు ఎవరిదో, అక్కడ ఎందుకు పెట్టారో సస్పెన్స్‌గా మారింది. దీనితో కారు నంబరు ఆధారంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ కారును నగదుతో సహా ఎవరో వదిలేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.

