కొవిడ్ కలకలం… స్కూళ్లకు సీఎం కీలక ఆదేశాలు..
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు కలకలం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన కొవిడ్ సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రంలోని స్కూళ్లకు, విద్యాసంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని విద్యార్థులు ఎవరైనా జ్వరం, జలుబు లేదా దగ్గు లాంటి లక్షణాలతో బాధపడుతుంటే వారిని తల్లిదండ్రులు పాఠశాలలకు పంపవద్దని కోరింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడానికి, ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లోనే ఉంటూ, తగిన వైద్య సంరక్షణలో చికిత్స తీసుకోవాలని పేర్కొంది.