Home Page SliderNational

దేశంలోనే పొడవైన సముద్ర వంతెన ముంబైలో (MTHL) రెడీ…

దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) రెడీ అయింది. మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న సెవ్రీ, రాయ్‌గఢ్ జిల్లాలో ఉన్న నావా షెవా ప్రాంతం మధ్య ఈ వంతెనను నిర్మించారు. దీని పొడవు 21.8 కిలోమీటర్లు. ఈ వంతెనను సముద్రం మీద 16.50 కిలోమీటర్లు, భూమిపై 5.50 కిలోమీటర్లు నిర్మించారు. జనవరి 12న ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ఈ వంతెన ప్రారంభం కానుంది.