మహిళా ఆఫీసర్లు సోఫియా, వ్యోమికాలతో పాక్‌కు కౌంటర్.. ఎందుకంటే..
పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించి, ఆ వివరాలను దేశ ప్రజలకు ఇద్దరు మహిళలతో చెప్పించింది రక్షణ శాఖ. వీరు బ్రీఫింగ్ ఇచ్చిన విధానం అందరినీ ఆకర్షించింది. కల్నల్ సోఫియా ఖురేషి, కమాండర్ వ్యోమికా సింగ్ ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి దేశ ప్రజలలో నెలకొంది. పహల్గాంలో మహిళల కళ్లెదుటే భర్తలను చంపిన టెర్రరిస్ట్ దాడులకు ప్రతీకారంగా మహిళలే ప్రతీకారం తీర్చుకుంటారని, మౌనంగా ఉండరని కేంద్రం పరోక్షంగా ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ యజ్ఞాన్ని కొనసాగించింది. ఇప్పుడు దానికి నిదర్శనంగా మహిళా ఆఫీసర్లనే ముందువరుసలో నిలబెట్టి వ్యూహాత్మకంగా వివరణ ఇచ్చింది. గుజరాత్‌కు చెందిన సోఫియా 1990లో సైన్యంలో చేరారు. బయోకెమిస్ట్రీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి, పీస్ మిషన్‌లో పనిచేశారు. 2016లో జరిగిన ఎక్సర్‌సైజ్ 18 అనే భారత ఆర్మీ బృందానికి నాయకత్వం వహించారు. ఇక వ్యోమికా సింగ్ చిన్నప్పటి నుండే పైలట్ కావాలనే ఆశయంతో ఇంజినీరంగ్ చేసి, వైమానిక దళంలో పైలట్‌గా ఫ్లయింగ్ బ్రాంచ్‌లో కమిషనర్‌గా ఉన్నారు. ఆమె జమ్మూ వంటి ప్రదేశాలలో ఎత్తైన క్లిష్టమైన ప్రాంతాలలో హెలికాఫ్టర్లను నడిపి, పలు రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్‌లోని దాడులు ఈమె నేతృత్వంలోనే జరిగాయని సమాచారం.

