కరోనా టెన్షన్.. వచ్చే 40 రోజులు కీలకం
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో దేశంలోనూ మరోసారి కొవిడ్ టెన్షన్ మొదలైంది. దీంతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తి పెరగకుండా ముందస్తు చర్యలు మొదలు పెట్టింది. అయితే.. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే 40 రోజులు కీలకం కానున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. చైనా సహా ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టిపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేసింది. ఒకవేళ కొత్త వేవ్ వచ్చినా.. కొవిడ్ మరణాలు, ఆసుపత్రుల్లో చేరికలు చాలా తక్కువే ఉంటాయని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. గత 2 రోజుల్లో దేశ వ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టుల్లో 6 వేల మంది విదేశీ ప్రయాణికులకు టెస్టులు చేయగా… 39 మందికి పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

