Home Page SliderNational

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,720 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే గడిచిన 24 గంటల్లో 20 మంది కరోనాతో మరణించినట్లు పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,31,584కు పెరిగింది. మరోవైపు దేశంలో 7,698 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. తాజాగా నమోదైన కొత్త కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40,177 కి చేరింది. దీంతో దేశప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ..వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ.. కరోనాను నివారించే దిశగా అడుగులు వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. అంతేకాకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రజలకు సూచించింది.