చైనాలో మళ్లీ కరోనా..లాక్ డౌన్
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల సమయంలో 4 వేల కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా కరోనా ప్రారంభమైనా చైనాలో మాత్రం పరిస్థితి భిన్నంగానే ఉందనే చెప్పాలి. తాజాగా వచ్చిన కథనాల ప్రకారం చైనాలో మళ్లీ లాక్ డౌన్ ఆంక్షలు కోనసాగుతున్నాయి. చైనాలోని 70 నగరాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చైనా లోని 70 నగరాల్లోనూ లాక్ డౌన్ నియమించాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తుందని సమాచారం. ఇప్పుడిప్పుడే కరోనా నుంది అన్ని దేశాలు కోలుకుంటుండగా , కొత్త కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.