తెలంగాణకు చల్లని కబురు..
తెలంగాణలో త్వరలో వర్షాలు మొదలవుతాయంటూ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు ఉపరితల చక్రవాక ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాగల 4 రోజులలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ జిల్లాలలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. దీనితో ఎండలతో సొమ్మసిల్లిపోతున్న హైదరాబాద్ నగర ప్రజలు ఊరట చెందుతున్నారు.

