Home Page SliderTelangana

దేశంలోనే మొట్టమొదటి రోబోటిక్ టెక్నాలజీతో ఆలయాల నిర్మాణం

తెలంగాణాలోని సిద్దిపేటలో రోబోటిక్ టెక్నాలజీతో మూడు ఆలయాలను నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటి సారిగా రోబోటిక్ టెక్నాలజీ, త్రీడీ టెక్నాలజీలతో నిర్మితమయ్యే ఆలయాలుగా నిలువనున్నాయి. దీనిద్వారా వందల మంది కష్టపడాల్సిన పనిలేదు. సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. కేవలం గంటల వ్యవధిలోనే ఈ నిర్మాణాలను నిర్మించవచ్చు.  ఈ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ మెషిన్‌ను ఏబీపీ అనే యూరోపియన్ కంపెనీ నుండి తెప్పించారు. తక్కువ మ్యాన్ పవర్, సృజనాత్మక డిజైన్లతో ఈ టెక్నాలజీ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అప్సూజ అనే కంపెనీ ఈ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.  సంప్లీ పోర్జ్ త్రీడీ టెక్నాలజీ సాయంతో ఈ నిర్మాణాన్ని గంటల వ్యవధిలోనే పూర్తి చేస్తుంది.

3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో  వినాయక మందిరం, శివాలయం, అమ్మవారి ఆలయాలను నిర్మిస్తున్నారు. మరొక నెలలో ఈ నిర్మాణాలు పూర్తి అవుతాయని ఈ కంపెనీ వారు చెపుతున్నారు. ఇలాంటి నిర్మాణాలు సరిహద్దు ప్రాంతాలలో, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, మంచు ప్రదేశాలలో చాలా ఈజీగా ముగ్గురు పనివాళ్ల సహాయంతోనే భవంతులు నిర్మించవచ్చు. డిజిటల్ డిజైన్‌ను కంప్యూటర్‌లో డిజైన్ చేసుకుని, కావలసిన సామాగ్రిని, ఈ త్రీడీ ప్రింటింగ్ మెషీన్‌ను వెంటబెట్టుకుని వెళ్తితే చాలు. కావలసిన చోట,  కావలసిన డిజైన్‌లో భవనాలు నిర్మించవచ్చు.