Home Page SliderNational

దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణం

భారత్‌లో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. ఏపీలో కూడా ఇళ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం మంజూరు చేస్తోందని తెలిపారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకూ కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించుకుంటే గత ప్రభుత్వం ఐదారు లక్షల ఇళ్లు కట్టించి ఉండొచ్చన్నారు. ఉపాధి హామీకి సంబంధించిన పనులయితే కేంద్రప్రభుత్వం ఏపీ కోసం పరిమితి లేకుండా నిధులు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిధుల వినియోగంలో పూర్తిగా విఫలమయ్యిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు వినియోగించి జల్ జీవన్ మిషన్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.