NationalNewsNews Alert

అయోధ్య రామమందిరం నిర్మాణ వ్యయం రూ. 1800 కోట్లు

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించేందుకు ₹ 1,800 కోట్ల అంచనా వ్యయం అవుతుందని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ట్రస్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఈ హిందూ పవిత్ర పట్టణంలో ఆలయ నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏర్పడిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇక్కడ మారథాన్ సమావేశం తర్వాత నియమావళిని ఆమోదించింది. ఫైజాబాద్ సర్క్యూట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో, ఆలయ సముదాయంలో ప్రముఖ హిందూ ధర్మకర్తల విగ్రహాల కోసం స్థలాన్ని ఏర్పాటు చేయాలని ట్రస్ట్ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. నిపుణుల నివేదిక ఆధారంగా కేవలం రామ మందిర నిర్మాణానికి ₹ 1,800 కోట్లు ఖర్చవుతుందని ట్రస్ట్ అంచనా వేసింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, సుదీర్ఘ చర్చ తర్వాత నిర్ణయాలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర సముదాయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలతోబాటుగా… రామాయణ కాలం నాటి ప్రధాన పాత్రల విగ్రహాలను కూడా రూపొందించాలని ట్రస్ట్ నిర్ణయించింది.

15 మంది ట్రస్టు సభ్యుల్లో 14 మంది సమావేశానికి హాజరయ్యారు. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా, ట్రస్ట్ చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్, కోశాధికారి గోవింద్ దేవ్ గిరి, సభ్యుడు ఉడిపి పీఠాధీశ్వర్ విశ్వతీర్థ ప్రసన్నాచార్య, డాక్టర్ అనిల్ మిశ్రా, మహంత్ దినేంద్ర దాస్, కామేశ్వర్ చౌపాల్, ఎక్స్ అఫీషియో సభ్యుడు జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్ చర్చలో పాల్గొన్నారు. ఇక ఆన్ లైన్ ద్వారా… కేశవ్ పరాశరన్, యుగ్పురుష్ పరమానంద్, విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరియు ఎక్స్-అఫీషియో మెంబర్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం, సంజయ్ కుమార్ చర్చలకు భాగమయ్యారు. డిసెంబర్ 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని, జనవరి 2024లో జరిగే మకర సంక్రాంతి పండుగ నాటికి రాముడు గర్భగుడిలో నిర్మాణం పూర్తవుతుంది.

రామాయణంలోని ముఖ్య ఘట్టాలను ప్రతిబింబించేలా ఈ ఆలయ నిర్మాణం ఉండబోతోందని తెలియజేశారు. ఈ దేవాలయ నిర్మాణం 2023 డిసెంబరుకు పూర్తి కావస్తుందని, 2024 జనవరిలో మకర సంక్రాతి రోజున ప్రారంభోత్సవం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 5 వతేదీ, 2020 నాడు ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన అయోధ్య శ్రీ రామమందిరం నిర్మాణం ప్రపంచ ప్రసిద్ధ కట్టడంగా రూపుదాల్చుతుందని ఆనాడే ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా సాగిన రామజన్మభూమి వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో ఓ కొలిక్కి వచ్చి ఆలయనిర్మాణం హిందువుల పవిత్ర నగరమైన ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రారంభించబడింది.