70 కోట్ల ఖరీదైన నిర్మాణాలు కూల్చివేతకు 20 కోట్ల ఖర్చు
ఢిల్లీ NCR ప్రాంతంలోని ప్రముఖనిర్మాణ సంస్థ సూపర్ టెక్ ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టును దాదాపు 100 మీటర్ల ఎత్తులో జంట టవర్లు నిర్మాణం చేసారు. నోయిడాలోని సెక్టార్ 93లో సూపర్‌టెక్ కంపెనీ 2009లో రూ.70 కోట్లతో ఈ టవర్లను కట్టింది. దీనిలో సెయానేకు 29 అంతస్తులు, అపెక్స్ 32 అంతస్తులు నిర్మింపబడ్డాయి. ఇవి కుతుబ్‌మీనార్ కంటే ఎత్తులో సుమారు 890 ప్లాట్లు కలిగి ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 600 అమ్ముడయ్యాయి. అయితే ఈ టవర్లు నిబంధనలకు విరుద్దంగా ఉండడంతో కూల్చివేయాలని సుప్రీంకోర్టు 2021 ఆగస్టులో తీర్పునిచ్చింది. ఇది చాలాసార్లు వాయిదాలు పడుతూ చివరికి ఆగస్టు 28 వ తేదీని సొంతఖర్చులతో కూల్చివేయాలని సూపర్ టెక్ సంస్థను ఆదేశించింది. ప్లాట్లు కొన్నవారికి రెండునెలల్లో డబ్బు వాపస్ ఇవ్వాలని కూడా తీర్పు నిచ్చింది.

వీటి నిర్మాణ ఖర్చు దాదాపు 70 కోట్లు అయ్యింది. అయితే దీనిని కూల్చివేయడానికి కూడా సుమారు 20 కోట్లు ఖర్చు కాబోతోంది. ఈ భవనాల కూల్చివేత బాధ్యతను ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించారు. నోయిడాలోని ఈ ట్విన్ టవర్స్ కూల్చివేత ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మెదలవబోతోంది. ఇందుకోసం 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించనున్నారు. రెండు టవర్లలో పేలుడు పదార్థాలను అమర్చడం ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం బాంబులను ఒకదానికొకటి అనుసంధానం చేస్తున్నారు. భవనాలను కూల్చివేసే రోజు వాటిని డిటోనేటర్‌కు కనెక్ట్ చేస్తారు. టవర్స్ కూల్చేస్తే చుట్టు ప్రక్కల భవనాలపై దుమ్ము పడకుండా పరదాలు ఏర్పాటు చేసారు. కూల్చివేత సమయంలో చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీనితో ఎవరైనా నిబంధనలను పాటించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అర్ధం చేసుకోవలసి వస్తుంది. ఢిల్లీ,నోయిడా, యూపీ ప్రాంతాల రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు ఈసంఘటనతో చాలా భయంతో, జాగ్రత్తగా నిర్మాణాలు చేయాలని కోర్టు ఆదేశించింది.