Breaking NewscrimeHome Page SliderInternationalNationalPolitics

అయోధ్య మందిర‌ విధ్వంసానికి కుట్ర‌

అయోధ్యలోని రామమందిర పరిసరాల్లో అనుమానాస్పద డ్రోన్ ఎగురుతూ కనిపించడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా అధికారులు డ్రోన్‌ను నేలకూల్చారు. ఆలయానికి సమీపంలో ఇలాంటి ఘటనలు జరగడం భద్రతాపరమైన ఆందోళనలను రేకిత్తించింది.వాస్తవానికి రామమందిర ప్రాంతంలో, ఆలయానికి దగ్గరగా డోన్లు ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయితే, యాంటీ డ్రోన్ వ్యవస్థను పరీక్షిస్తున్న సమయంలో ఈ అనుమానాస్పద డ్రోన్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమై, డ్రోన్‌ను నేలకూల్చినట్లు ప్రకటించారు.రామాలయం ప్రాంతంలో గందరగోళం సృష్టించేందుకు, పెద్ద సంఖ్యలో భక్తులను చంపేందుకు కుట్రగా పేర్కొంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముందుగా, బాంబు నిర్వీర్య దళం డ్రోన్ కెమెరాను క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి భద్రతా ముప్పు లేదని నిర్ధారించిందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి రామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.