Home Page SliderNational

లోక్‌సభలో ప్రతిపక్షనేతను కాంగ్రెస్ నిర్ణయిస్తుంది…శరద్ పవార్

లోక్‌సభలో ప్రతిపక్షనేతను కాంగ్రెస్ నిర్ణయిస్తుంది అని ఎన్సీపీ నేత శరద్ పవార్ పేర్కొన్నారు. తమ ఇండియా కూటమిలో అత్యధిక ఎంపీ స్థానాలున్న కాంగ్రెస్ పార్టీయే ప్రతిపక్షనేతను నిర్ణయించే అధికారం తీసుకుంటుందని తెలియజేశారు. తమ కూటమి పార్టీలలో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీకే అవకాశం ఇవ్వాలని ముందే  నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. 99 సీట్లతో అగ్రస్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారినే ప్రతిపక్ష నేకహా అంగీకరిస్తామని తెలియజేశారు. ఈ మధ్య సీడబ్ల్యూసీ రాహుల్ గాంధి పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా కూడా ప్రతిపక్ష నేతకు అవకాశం ఇచ్చే నియమాన్ని ప్రధాని మోదీ గత రెండు ప్రభుత్వాల్లో పాటించలేదన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.